బుర్జ్ ఖలీఫాకి శ్రీలంక జెండా వెలుగులు
- April 26, 2019
దుబాయ్‌లోని ప్రముఖ నిర్మాణం బుర్జ్ ఖలీఫా శ్రీలంక జెండా వెలుగులతో దర్శనమిచ్చింది. ప్రపంచంలో శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహనంతో వ్యవహరించాలని ఈ సదర్భంగా బుర్జ్ ఖలీఫా యాజమాన్యం ఆకాంక్షించింది. బుర్జ్ ఖలీఫాతోపాటు అబుదాబీలోని ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ శ్రీలంక జాతీయ జెండా వెలుగులతో కనిపించాయి. ఎమిరేట్స్ ప్యాలెస్, షేక్ జాయెద్ బ్రిడ్జి, అడ్‌నాక్ బిల్డింగ్, క్యాపిటల్ గేట్ కూడా శ్రీలంక రంగులతో నిండిపోయాయి. ఈస్టర్ ఆదివారం పవిత్ర ప్రార్థనలు చేస్తున్న సమయంలో శ్రీలంకలో తీవ్రవాదులు మారణహోమానికి పాల్పడి దాదాపు 400 మంది ప్రాణాలు బలిగొన్న విషయం విదితమే. 500 మందికి పైగా క్షతగాత్రులు తమ ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికీ పేలుళ్ళ టెన్షన్ శ్రీలంకలో తగ్గలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..