బెజవాడ ఎయిర్‌పోర్టు సూపర్ రికార్డ్‌!

- April 27, 2019 , by Maagulf
బెజవాడ ఎయిర్‌పోర్టు సూపర్ రికార్డ్‌!

ఏడాదికేడాదికి ఇంతింతై వటుడింతైన చం దాన విజయవాడ విమానాశ్రయం దూసు కుపోతోంది. దేశంలో మెట్రోపాలిటన్‌ ఎయి ర్‌పోర్టులను తలదన్నేలా ఉన్న ఫ్లీట్‌లో వృద్ధిని సాధిస్తున్న విజయవాడ విమానాశ్రయం పది లక్షల ప్రయాణికులు రాకపోకలు సాగించే జాబితాలో ఎప్పుడు చేరుతుందా అనే కోరిక ఇప్పుడు ఫలించింది. పది లక్షలమంది ప్రయాణికుల క్లబ్బులో ఇంకా చేరకముందే వాటిని మించిన వృద్ధిని నమోదు చేసిన విజ యవాడ ఎయిర్‌పోర్టు ఇప్పుడు ఏకంగా ఆ క్లబ్బులో చేరటంతో పాటు ఆర్థిక సంవ త్సరాంతానికి ఇంకా వృద్ధిరేటును మెరుగు పరచుకుంటూ దూసుకుపోతోంది. శనివారం విడుదల చేసిన ఎయిర్‌పోర్టు ఫలితాలు న వ్యాంధ్రలో విజయవాడ ఎయిర్‌పోర్టు రేం జ్‌ను చాటిచెప్పింది. ఫలితాల ప్రకారం చూ స్తే.. ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి మొత్తం 11,91,439 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దేశం, విదేశాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి 6,51,762 మంది ప్రయాణికులు వచ్చారు. విజయవాడ విమానాశ్రయం నుంచి 5,75,677 మంది ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాలకు బయలుదేరారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నెలకు 99,287 మంది ప్రయాణికుల చొప్పున రాకపోకలు సాగించారు. రోజుకు సగటున 3,264 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించారు. ఆర్థిక సంవత్సరాంతాన అంతర్జాతీయ సర్వీసు ప్రారంభమైంది. ఇప్పటి వరకు 6,254 మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. విజయవాడ విమానాశ్రయంలో మొత్తం 21,169 ట్రిప్పులను విమానాలు వేశాయి. వివి ధ ప్రాంతాల నుంచి విజయవాడకు 10,587 ట్రిప్పులు, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు 10,582 ట్రిప్పులు వేశాయి. సగటున నెలకు 1764 ట్రిప్పులు వేయగా, రోజుకు 58 ట్రిప్పులు వేయటం గమనార్హం.

2013 - 2019 వరకు ప్రయాణికుల ప్రస్థానం ఇలా...

2013- 14 1,95,000

2014- 15 2,33,000

2015- 16 4,01,000

2016- 17 6,27,000

2017- 18 7,50,000

2018- 19 11,91,439

2013 - 2019 వరకు విమానాల రాకపోకలు

2013- 14 4733

2014- 15 5386

2015- 16 7710

2016- 17 11,631

2017- 18 13,487

2018- 19 21,169

2018 - 19లో ప్రయాణికుల మూవ్‌మెంట్‌

రాకపోకలు సాగించిన ప్రయాణికులు మొత్తం - 11,91,439

విమానాశ్రయానికి వచ్చిన వారి సంఖ్య - 6,15,762

విమానాశ్రయం నుంచి బయలు దేరిన వారు - 5,75,677

ట్రాన్సిట్ పాసెంజర్లు - 21,983

సగటున నెలకు ప్రయాణించిన ప్రయాణికులు - 99,287

సగటున రోజుకు ప్రయాణించిన ప్రయాణికులు - 3,264

ప్రయాణించిన అంతర్జాతీయ ప్రయాణికులు - 6,254

2018 - 19 ఆర్థిక సంవత్సరంలో విమానాల మూవ్‌మెంట్‌ ఇలా ..

మొత్తం మూవ్‌మెంట్‌ - 21,169

ఎయిర్‌క్రాఫ్ట్‌ అరైవల్స్‌ - 10,587

ఎయిర్‌క్రాఫ్ట్‌ డిపార్చర్‌ - 10,582

సగటున నెలకు మూవ్‌మెంట్‌ - 1764

సగటున రోజుకు మూవ్‌మెంట్‌ - 58

ఇంటర్నేషనల్‌ మూవ్‌మెంట్‌ - 68

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com