మెగా హీరో సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి
- April 27, 2019
మెగా కుటుంబం నుంచి సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రీలుక్‌ను కూడా విడుదల చేశారు. సినిమాలో మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. యూనిట్‌లోకి ఆయన్ను స్వాగతిస్తూ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో విజయ్ ప్రతినాయకుడి పాత్రను పోషించబోతున్నారు. 'సైరా నరసింహారెడ్డి' తర్వాత ఆయన తెలుగులో నటిస్తున్న రెండో సినిమా ఇది కావడం విశేషం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..