తొలిసారి ఆర్మీలో మహిళల రిక్రూట్‌మెంట్..నోటిఫికేషన్ జారీ

- April 29, 2019 , by Maagulf
తొలిసారి ఆర్మీలో మహిళల రిక్రూట్‌మెంట్..నోటిఫికేషన్ జారీ

భారత రక్షణ శాఖ చరిత్రలోనే మొదటిసారి మహిళా జవాన్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అమ్మాయిలు ఆన్‌లైన్ ద్వరా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసింది. సోల్జర్ జనరల్ డ్యూటీ (విమెన్ మిలటరీ పోలీస్) ఉద్యోగాల కోసం జూన్ 8 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. అక్టోబర్ 1, 1998 నుంచి ఏప్రిల్ 1, 2002 మధ్య జన్మించిన మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అత్యాచారాలు, దొంగతనాలు తదితర కేసులను మహిళా జవాన్లు విచారిస్తారు.

పొరుగు దేశాలు కాల్పులు జరిపినప్పుడు సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం, కార్డన్ సెర్చ్ చేపట్టినప్పుడు మహిళలను తనిఖీ చేయడం లాంటి విధులను వీరు నిర్వర్తిస్తారు. సుమారు 800 మంది మహిళలను తీసుకునే అవకాశం ఉంది. పర్సనల్ బిలో ఆఫీసర్ ర్యాంకులో మహిళలకు కూడా అవకాశం కల్పిస్తామని రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే సైన్యంలోకి తీసుకున్న మహిళా జవాన్లను సరిహద్దుల్లో పహారాకు పంపడం లాంటి కఠిన బాధ్యతలను మాత్రం అప్పగించరు. సరిహద్దుల్లో మహిళా సైనికుల కోసంసరైన సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com