మరోసారి తన దుర్నీతిని ప్రదర్శించిన చైనా దేశం

- April 29, 2019 , by Maagulf
మరోసారి తన దుర్నీతిని ప్రదర్శించిన చైనా దేశం

చైనా మరోసారి తన దుర్నీతిని ప్రదర్శించింది. మనదేశానికి చేరువలో తన సైనిక సత్తాను చైనా క్రమంగా పెంచు కుంటోంది. తాజాగా టిబెట్ భూభాగంలో H-6 బాంబర్ విమానాలను మోహరించింది. హాపింగ్‌ వైమానిక క్షేత్రంలో H-6 బాంబర్లను రంగంలోకి దించింది. 155-MMశతఘ్నులను కూడా అక్కడ మోహరించినట్లు సమాచారం.

హాపింగ్‌ వైమానిక క్షేత్రం, మనదేశంలోలోని సిక్కిం సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పౌర, సైనిక విమానాల కార్యకలాపాలకు పనికొచ్చే ఈ స్థావరాన్ని చైనా సైన్యం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. హాపింగ్‌ స్థావరంలోని యుద్ధవిమానాలను శత్రు వైమానిక దాడుల నుంచి రక్షించేలా ప్రత్యేక శిబిరాలు కూడా చైనా నిర్మిస్తు న్నట్లు తెలుస్తోంది.

సోవియట్‌ హయాం నాటి టుమోలెవ్‌ TU-16 బాంబర్‌ ఆధారంగా H-6ను చైనా రూపొందించింది. ఇది దీర్ఘశ్రేణి దాడు లకు పనికొస్తుంది. వ్యూహాత్మక బాంబర్‌గా పేర్కొనే H6 బాంబర్‌కు, అణ్వస్త్ర సామర్థ్యమున్న అమెరికా విమానవాహక నౌకలపై దాడి చేయగల సత్తా ఉందని సమాచారం. ఇలాంటి ఆయుధాన్ని తమ సరిహద్దుల్లో మోహరించడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే ఏం చేయాలి..? ఈ బాంబర్‌ ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? తదితర అంశాలపై భారత భద్రతా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

డోక్లామ్‌లో చైనా-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడినప్పటి నుంచి భారత సరిహద్దుల వెంబడి చైనా భారీగా సైనిక ఆధునికీకరణ చేపడుతోంది. అనేక సైనిక శిబిరాలను కొత్తగా నిర్మించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు 900 కిలోమీటర్ల దూరంలోని యుక్షి ప్రాంతంలో రహస్య క్షిపణి విభాగాన్ని మోహరించింది. ఇప్పుడు H-6 బాంబర్లను కూడా రంగంలోకి దింపడంతో సరిహద్దుల్లో హై టెన్షన్ ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com