కార్ డాన్సర్‌కి రెండు వారాల జైలు శిక్ష
- April 30, 2019
బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్ట్ జిసిసి మహిళ ఒకరికి రెండు వారాల జైలు శిక్షను ఖరారు చేసింది. పబ్లిక్ అసభ్యతకి పాల్పడినందుకుగాను సదరు మహిళ ఈ జైలు శిక్షకు గురైంది. ఆమెకు సంబంధించిన 50 సెకెన్ల నిడివిగల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడమే దీనికి కారణం. ఆ వీడియోలో నిందితురాలు, కారులో వెళుతూ పెద్ద సౌండ్‌తో డాన్స్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించింది. ఆ సమయంలో నిందితురాలి బాయ్‌ఫ్రెండ్ కారు నడుపుతుండగా, సన్ రూఫ్‌ని తెరచి, అందులోంచి పైకి లేచి ఆమె డాన్సులు చేసింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు, నిందితురాలితోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని కూడా అరెస్ట్ చేశారు. అరేబియన్ పార్టీలో ఎంజాయ్ చేశామనీ, అర్థరాత్రి 2 గంటల సమయంలో పార్టీ నుంచి బయటకు వచ్చామనీ, సన్ రూఫ్ ఓపెన్ చేసి, అందులోంచి తాను బయటకు చూసేందుకు ప్రయత్నించానని విచారణలో పేర్కొంది నిందితురాలు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







