'ఫోని' తుఫాన్ హెచ్చరికలు : ఎదుర్కొనేందుకు భారత్ ఆర్మీ రెడీ

- April 30, 2019 , by Maagulf
'ఫోని' తుఫాన్ హెచ్చరికలు : ఎదుర్కొనేందుకు భారత్ ఆర్మీ రెడీ

'ఫోని' తుఫాన్ హెచ్చరికలతో అధికారగణం సర్వం సిద్ధమయ్యింది. దీని ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో 'ఫోని' తుఫాన్ హెచ్చరికలతో ప్రజలకు సేవలందించేందుకు భారత సైన్యం సమాయత్తమైంది. 

తుఫాన్ వల్ల భారీ వర్షాలతోపాటు వరదలు వెల్లువెత్తి, భారీ గాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరికలతో భారత నావికాదళం, భారత వైమానిక దళాలు అప్రమత్తమై తమ నౌకలు, హెలికాప్టర్లను సిద్ధం చేశాయి. తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం తీరంలో ఐఎన్ఎస్ రాజాలీ నౌక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో ఐఎన్ఎస్ డేగ నౌకలను కేంద్రం రంగంలోకి దించింది. తుఫాన్ బారిన పడిన ప్రజలను కాపాడేందుకు వీలుగా హెలికాప్టర్లను సైతం సిద్ధం చేశారు. తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు రబ్బరు పడవలు, పునరావాస పరికరాలు, ఆహార సామాగ్రిని సిద్ధంగా ఉంచారు. వైద్యానికి కావాల్సిన అన్ని రకాల చర్యల్ని సిద్ధం చేశారు. ఈ క్రమంలో డాక్టర్లతోపాటు కావాల్సిన మెడిసిన్స్ ఔషధాలను కూడా భారత సైన్యం సిద్ధం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com