ఫ్లాష్ ఫ్లాష్.. శాంసంగ్ ఫోన్లపై రూ.15,000 తగ్గిస్తున్నారట..
- April 30, 2019
అవసరానికి ఫోన్.. అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఖరీదైన ఫోన్.. వెరసి మార్కెట్లో లక్షలు ఖరీదు చేసే ఫోన్లు.. శాంసంగ్ ఏకంగా రూ.15,000లు తగ్గించి భారీ డిస్కౌంట్‌ని అందిస్తోంది వినియోగదారుడిని ఆకర్షించడానికి. తాజాగా గెలాక్సీ ఎస్ 10 సిరీస్ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ని ప్రకటించింది.
శాంసంగ్ ఈ-స్టోర్ నుంచి గెలాక్సీ ఎస్ 10ఇ ఫోన్‌ని కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐపై రూ.4,000 క్యాష్‌బ్యాక్ ఉంది. ఇవన్నీ కలిపి ఈ ఫోన్ ధర రూ.55,900 నుంచి రూ.9,000లు తగ్గి 46,900కు వస్తుంది.
గెలాక్సీ ఎస్10 128 జీబీ వేరియంట్‌పై కూడా రూ.5,000 తక్షణ క్యాష్‌బ్యాక్ ఉంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐపై రూ.6,000 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. దీంతో దీని ధర రూ.66,900 అయితే రూ.55,900కే వస్తుంది.
గెలాక్సీ ఎస్10 512 జీబీ వేరియంట్‌పై రూ.8,000 తక్షణ క్యాష్ బ్యాక్ లభిస్తోంది. అలాగే బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ఆప్షన్లు అన్నీ కలిపి రూ.6,000 క్యాష్ బ్యాక్ ఉంది. దీంతో ఈఫోన్ ధర రూ.84,900 నుంచి రూ.70,900కు దిగివచ్చింది.
గెలాక్సీ ఎస్ 10 ప్లస్‌కి చెందిన ఏ వేరియంట్ పైన అయినా రూ.9,000 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. మిగిలిన ఆఫర్లు కలుపుకుని రూ.6,000 క్యాష్ బ్యాక్ ఉంది. దీంతో దీని ధర రూ.15,000 వరకు తగ్గుతుంది. ఇంకా ఆకర్షణీయమైన ధరలో మరికొన్ని ఫోన్లు మే 14న మార్కెట్లో దర్శనమివ్వనున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..