ఐసిస్ చీఫ్ అబూ బకర్ జిందా హై
- April 30, 2019
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఛీప్ అబూ బకర్ అల్ బాగ్దాది బతికే ఉన్నాడు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత అతను ఒక వీడియోలో కనిపించాడు. సిరియాలో పాతుకుపోయిన ఐసిస్ సంస్థను 2014లో అక్కడి సైన్యం తరిమికొట్టింది. అప్పుడు జరిగిన బాంబు దాడులలో అబూ బకర్ మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. అప్పటి నుంచీ కనిపించకుండా పోయిన వ్యక్తి తాజాగా ప్రత్యక్షమైన ఈ వీడియోలో దర్శనమిచ్చాడు.
ఒక గదిలో ప్రశాంతంగా కుర్చున్న అబూ బకర్ ఇటీవల శ్రీలంకలోని చర్చిలు, హోటళ్ల దాడులు, ఆత్మాహుతి దాడులపై మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ఐసిస్ ఉగ్రవాద సంస్థలో ఉన్న వారిని అభినందించాడు. శ్రీలంకలో జరిగిన మారణకాండలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న అబూ బకర్ శ్రీలంక పేలుళ్ల తర్వాత వీడియోలో కనిపించడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా.. ఈ వీడియోలో అబూ బకర్ కేవలం 40 సెకన్ల పాటు మాత్రమే మాట్లాడాడు. ఇస్లాం మతం కోసం తమ పోరాటం కొనసాగుతుందని.. ఇస్లాములపై దాడులకు, హింసాత్మక చర్యలకు మూల్యం తప్పదని వీడియోలో హెచ్చరించాడు. అయితే.. ప్రస్తుతం ఈయన ఏ దేశంలో ఉన్నాడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







