కోకాపేటలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్‌

కోకాపేటలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్‌

హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కోకాపేటలో నటులు ఎన్టీఆర్‌, రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరపనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం మరోసారి పూణేకి వెళ్ళనుంది. అక్కడ పెండింగ్ షెడ్యూల్ పూర్తి చేయనున్నారు. అనుకున్న టైంకి చిత్రీకరణని పూర్తి చేసి జూలై 30,2020న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకుడు రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్నాడు. ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలియా భట్ .. చరణ్‌కి జోడీగా నటించనుంది.

Back to Top