త్వరలో చిరు మరో సినిమా షురూ..కొరటాల తో జోడి

త్వరలో చిరు మరో సినిమా షురూ..కొరటాల తో జోడి

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా నరసింహారెడ్డి'చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి చిత్రంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

చిరంజీవి తన తదుపరి చిత్రం కొరటాల శివతో వున్న సంగతి తెలిసిందే. 'సైరా' షూటింగ్ త్వరలో పూర్తి చేసుకొని పెద్ద గ్యాప్ లేకుండా రెగ్యులర్ కొత్త చిత్రం షూటింగును మొదలుపెడతారని అంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన కొరటాల ఈ చిత్రం ఆగస్టులో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారట. ఇక హీరోయిన్లుగా తమన్నా, శ్రుతిహాసన్ పేర్లు వినిపిస్తున్నాయిగానీ, ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ మాత్రం వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Back to Top