యూ.ఏ.ఈ విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో సాముహిక సత్యనారాయణ వ్రతం

యూ.ఏ.ఈ విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో సాముహిక సత్యనారాయణ వ్రతం

యూ.ఏ.ఈ లో గల విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో గత గురువారం (ఏప్రిల్ 24) నుండి శనివారం(ఏప్రిల్ 26) వరకు సాముహిక సత్యనారాయణ వ్రతం మరియు విష్ణుసహస్రనామ అఖండ పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు 44 గంటల పాటు ఏకధాటిగా 144మార్లు విష్ణుసహస్రనామ స్తోత్ర పఠనం చేసారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ తో మొదలైన ఈ కార్యక్రమం, అనంతరం స్వమివారి అభిషేకం, మహానివేదన అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతం, మహాప్రసాదం తదితర కార్యక్రమాలతో కొనసాగింది. శుక్రవారం తిరిగి సుప్రభాత సేవ తో మొదలై కొనసాగిన అఖండ విష్ణుసహస్రనామ పారాయణ శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో హాజరైన భక్తులు స్వామివారి అమూల్యమైన కృపకు పాత్రులయ్యారు.

Back to Top