కోకాపేటలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్
- April 30, 2019
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కోకాపేటలో నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ మూవీ చిత్రీకరణ జరపనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం మరోసారి పూణేకి వెళ్ళనుంది. అక్కడ పెండింగ్ షెడ్యూల్ పూర్తి చేయనున్నారు. అనుకున్న టైంకి చిత్రీకరణని పూర్తి చేసి జూలై 30,2020న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకుడు రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్నాడు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్ కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలియా భట్ .. చరణ్‌కి జోడీగా నటించనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







