రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

- May 01, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

ఇద్దరు ఎమిరేటీ అన్నదమ్ములు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. షార్జా వైపుగా ఖోర్‌ఫక్కన్‌ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల కజిన్స్‌కి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వాహనం నడుపుతున్న వ్యక్తి, వాహనంపై అదుపు కోల్పోవడంతో ప్రమాదం జరిగిందనీ, రోడ్డు డివైడర్‌ని అతి వేగంగా ఢీకొని, ఆ తర్వాత పలుమార్లు వాహనం బోల్తా కొట్టిందని, ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. గాయపడ్డవారిని అల్‌ ధయిద్‌ హాస్పిటల్‌కి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com