జపాన్ నూతన చక్రవర్తి గా నరూహితో పట్టాభిషేకం
- May 01, 2019
టోక్యో: జపాన్ నూతన చక్రవర్తి నరూహితో సింహాసనాన్ని అధిష్ఠించారు . ఈ మేరకు వారసత్వంగా సంక్రమించే ఖడ్గం, నగలు, రాజముద్రలను అందుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం అతి కొద్దిమంది ప్రముఖుల మధ్య జరిగింది. కొత్త చక్రవర్తి భార్య సహా రాజవంశానికి చెందిన మహిళలు ఎవరినీ ఈ కార్యక్రమానికి అనుమతించలేదు. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి జపాన్ 126వ చక్రవర్తి హోదాలో నరూహితో తొలిసారి ప్రసంగించారు. కొత్త రాజు శకానికి శుభప్రదమైన కాలంగా నామకరణం చేశారు. అక్టోబర్ 22న ప్రజల మధ్య కొత్త చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరై జపాన్ కొత్త చక్రవర్తి నరూహితోకు శుభాకాంక్షలు తెలపనున్నారు. 85 ఏళ్ల అకిహితో జపాన్ చక్రవర్తిగా వైదొలగడంతో ఆయన కుమారుడు నరూహితో ఈ రోజు సింహాసనాన్ని అధిష్ఠించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







