ఇండియాకి ప్రాణంతోనే వెళ్ళాలి.. శవంగా కాదు!
- May 02, 2019
బహ్రెయిన్: 80 ఏళ్ళ వలసదారుడొకరు బహ్రెయిన్ కింగ్డమ్లో వివిధ కారణాలతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కోర్టు కేసులు, లోన్లు సహా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి స్వదేశానికి సజీవంగా వెళ్ళాలన్న ఆవేదనతో వున్నారు. కేరళకు చెందిన నలరాజన్ దుస్థితి ఇది. ఒకప్పుడు ప్రముఖ బిజినెస్‌మెన్‌గా బహ్రెయిన్‌లో నలరాజన్ వ్యవహరించారు. వెస్ట్ ఎకెర్లో ఆయనకు ఓ బేకరీ షాప్ వుండేది. పదేళ్ళ క్రితం నష్టాలతో అప్పులు చేయాల్సి వచ్చిందనీ, వాటి వడ్డీల కారణంగా తన జీవితం ఇబ్బందుల్లో పడిందని చెప్పారు నలరాజన్. నలరాజన్ అప్పులు సుమారుగా 40,000 బహ్రెయినీ దినార్స్‌గా వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ ఎంబసీ ఇచ్చే 30 బహ్రెయినీ దినార్స్ గ్రాంట్‌తోనే జీవితం గడుపుతున్నట్లు చెప్పారు. 'సజీవంగా నేను స్వదేశానికి వెళ్ళాళి.. శవంగా మారి శవపేటికలో వెళ్ళాలనుకోవడంలేదు' అని నలరాజన్ చెబుతున్న మాటలు వినేవారికి కంటతడి పెట్టిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







