వలసవాసులకు 'డిఎన్ఎ టెస్ట్' ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం
- May 03, 2019
దేశంలోకి పెరుగుతున్న వలసలను నిరోధించేందుకు వీలుగా వలసవాసుల కుటుంబ సంబంధాలను నిర్ధారించేందుకు వారికి సత్వర (రాపిడ్) డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని అమెరికా సరిహద్దు భద్రతా విభాగం అధికారులు నిర్ణయించారు. తల్లితండ్రులతో చిన్నారుల రక్త సంబంధాన్ని నిర్ధారించుకునేందుకు వలస వాసులకు సత్వర డిఎన్ఎ పరీక్షలు నిర్వహించనున్నట్లు హోంశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల ప్రక్రియను ఇప్పటికే అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో ప్రారంభించామని చెప్పారు. ఈ ప్రాంతంలోనే ప్రతి నెలా ఎక్కువ మంది అక్రమ వలసదారులు సరిహద్దులను దాటి అమెరికాలో ఆశ్రయాన్ని కోరుతుంటారని వారు వివరించారు. కొంతమంది వ్యక్తులు తమకు సంబంధం లేని చిన్నారులను వెంట తీసుకుని అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారని, వారిని నిరోధించేందుకే ఈ పరీక్షలు చేపట్టామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







