అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ బహ్రెయిన్‌ అడ్మిషన్స్‌ ప్రారంభం

- May 03, 2019 , by Maagulf
అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ బహ్రెయిన్‌ అడ్మిషన్స్‌ ప్రారంభం

బహ్రెయిన్‌: కింగ్‌డమ్‌లో తొలిసారిగా అమెరికన్‌ స్టయిల్‌లో నిర్మితమైన యూనివర్సిటీ అమెరికన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ బహ్రెయిన్‌, సెప్టెంబర్‌ 2019 టెర్మ్‌ కోసం అడ్మిషన్స్‌ ప్రాసెస్‌ని ప్రారంభించింది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మే 4న బహ్రెయిన్‌ హోటల్‌ బేలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాలుగు సెషన్లు 'ఓప్‌ డే' నిర్వహించనుంది. యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాచిలర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఇంజనీరింగ్‌ మరియు ఆర్కిటెక్చర్‌ అండ్‌ డిజైన్‌ విభాగాల్లో డిగ్రీ కోర్సుల్ని యూనివర్సిటీ అందించనుంది. ఎయుబిహెచ్‌ ఫౌండింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సుసాన్‌ ఇ సాక్స్‌ట్‌ మాట్లాడుతూ, విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన చాలా ఆనందంగా వుందని చెప్పారు. అత్యంత సమర్థులైన ఫ్యాకల్టీ ద్వారా తమ యూనివర్సిటీలో మెరుగైన విద్యను అందిస్తామని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com