వన్ డే సీ ప్రిన్స్: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలిక కోరిక తీర్చిన అధికారులు
- May 03, 2019
అబుధాబి:14 ఏళ్ళ ఎమిరేటీ గర్ల్ జెనిటిక్ డిజార్డర్ సమస్యతో బాధపడుతోంది. అల్ అయిన్ హాస్పిటల్‌లో వైద్య చికిత్స పొందుతోన్న ఆమె కోరికను తెలుసుకున్న అధికారులు, ఆ కోరికను తీర్చారు. ఒకరోజు సీ ప్రిన్స్‌గా ఆమెను మార్చారు. ఆసుపత్రి నుంచి ప్రత్యేక పోలీస్ హెలికాప్టర్‌లో ఆమెను బీచ్ వద్దకు తీసుకెళ్ళారు. బాధితురాలి పేరు హలిమా. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా బాలిక కోరికను తెలుసుకున్నామనీ, ఆమె కోరికను తీర్చామని అధికారులు పేర్కొన్నారు. హలీమాను ప్రిన్సెస్‌లా తయారు చేసి, బీచ్ వద్దకు తీసుకెళ్ళడం జరిగింది. తొలుత సాధారణంగానే వున్న హలీమా, వయసు పెరగడంతో జెనిరిక్ డిజార్డర్స్ బయటపడ్డాయి. పూర్తిగా ఆమె ఇప్పుడు వెంటిలేటర్‌పై వుంది. ప్రస్తుతం ఆమెకు బ్రెయిన్ క్యాన్సర్ సోకింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..