పైపులలో బంగారాన్ని తరలిస్తూ చివరకు..

- May 04, 2019 , by Maagulf
పైపులలో బంగారాన్ని తరలిస్తూ చివరకు..

శంషాబాద్‌:ఎందెందు వెతికినా..అందందే బంగారం అన్నట్టుగా తయారైంది శంషాబాద్‌ విమానాశ్రయం పరిస్థితి. బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు గోల్డ్ స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. సరికొత్త పంతాను అనుసరిస్తున్నారు. స్మగ్లర్ల సరికొత్త ఎత్తులు కస్టమర్స్ అధికారులకు సవాల్‌గా మారుతున్నా అప్రమత్తతో వారి ఆటలు సాగడం లేదు. తాజాగా విదేశాల నుంచి హైద్రాబాద్‌కు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుండగా సినీ ఫక్కీలో వారి గుట్టును రట్టు చేశారు కస్టర్స్ అధికారులు.

దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడు తన వెంట మహిళలు వాడే హ్యాండ్‌ బ్యాగులను తీసుకొచ్చాడు. ఐతే కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. మహిళల హ్యాండ్‌ బ్యాగ్‌ల అంతర్భాగంలో బంగారాన్ని తరలిస్తు పట్టుబడ్డాడు. బ్యాగ్‌కు బిగించిన క్లిప్పులను బంగారంతో చేయించి..వాటికి సిల్వర్ కోటింగ్ వేయించి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ కస్టమ్స్‌ అధికారులు గోల్డ్ స్మగ్లర్ ఆటల సాగనివ్వలేదు. సోదాల్లో బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించి ఆర కిలోకి పైగా బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే..దుబాయ్‌ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో ప్రయాణికుడు ఫిరోజ్ ఖాన్ సినీ ఫక్కీలో బంగాన్ని తరలిస్తు అడ్డంగా దొరికిపోయాడు. సూట్‌ కేసు అంతర్భాంగంలో ఉండే ఇనుప పైపులలో బంగారాన్ని అమర్చి తరలిస్తు పట్టుపడ్డాడు. కడ్డీలను కరగదీసి కిలోకు పైగా బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు అధికారులు

ప్రయాణికుల ముసుగులో విదేశాల నుంచి కిలోల కొద్ది బంగారాన్ని అక్రమ మార్గాల్లో హైదరాబాద్ కు తరలిస్తున్నారు స్మగ్లర్లు. ఒకవైపు కస్టమ్స్ అధికారులు,మరోవైపు DRI అధికారులు వీరి అక్రమాలకు చెక్ పెట్టడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ బంగారం స్మగ్లింగ్‌కు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com