సెల్‌ ఫోన్‌ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు

- May 04, 2019 , by Maagulf
సెల్‌ ఫోన్‌ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు

ఏ.పి:ఒకప్పుడు పిల్లలు గ్రౌండ్‌లో ఆటలాడేవారు. ఆ తరువాత కనీసం వాకిట్లో అయినా ఆడుకునేవారు. అలాంటిది టెక్నాలజీ మాయాజాలం.. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్. ప్రపంచం అర చేతిలో ఉందని సంబరపడడమేమో కానీ ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో చెప్పనలవి కానిది. సాంకేతిక విప్లవాన్ని ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంటే ఇలానే అనిపిస్తుందేమో. ఇప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి రావడం మొబైల్ తీసుకుని అందులో గేమ్స్ ఆడడం.
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం బీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. సెల్‌ ఫోన్‌ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రితో చావుబతుకుల మధ్య ఉన్నారు. కాలనీకి చెందిన ఇస్మాయిల్‌ కు ఇద్దరు కొడుకులు. పదేళ్ల సయ్యద్‌, ఆరేళ్ల మౌలాలీ ఇంట్లో ఇద్దరూ ఫోన్‌ లో ఆటలాడుతున్నారు. బాటరీ అయిపోతుందని ఛార్జింగ్‌ పెట్టి మరీ గేమ్స్‌ ఆడుతున్నారు. దీంతో ఫోన్‌ వేడెక్కింది.. ఎండాకాలం కూడా కావడంతో మరింత హీటెక్కి బ్యాటరీ పేలిపోయింది. పెద్ద శబ్ధంతో ఫోన్‌ తునాతునకలైంది. చిన్నారులకు ఒంటినిండా తీవ్రగాయాలయ్యాయి.
పెద్దగా శబ్ధం రావడంతో గదిలోకి వచ్చిన తల్లిదండ్రులు చూసి నిర్ఘాంతపోయారు. ఫోన్‌ పేలడంతో తీవ్రగాయాలైన చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం.. ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త సుమా. చార్జింగ్ ఉందీ లేంది చూసుకోని ఇవ్వండి. అసలు సెల్‌కి దూరంగా ఉంచితే మరీ మంచిదేమో ఓ సారి ఆలోచించండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com