సోషల్ మీడియాను నిషేధించడంపై భిన్నస్వరాలు

- May 06, 2019 , by Maagulf
సోషల్ మీడియాను నిషేధించడంపై భిన్నస్వరాలు

శ్రీలంకలో గత నెల 21న చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. దాడుల తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ప్రపంచమంతా క్రమంగా ఈ నినాదం బలపడుతోంది. అయితే ఆంక్షలను ఆన్‌లైన్ స్వేచ్ఛపై ప్రమాదకర దాడులుగా కొందరు ఆరోపిస్తున్నారు. మరికొందరు సమర్ధిస్తున్నారు.

గతంలోనూ వివిధ దేశాల్లో ఇంటర్నెట్‌పై, సోషల్ మీడియాపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. చైనా, రష్యా వంటి దేశాల్లో పరిమితంగా అనుమతిస్తున్నారు. ఇంటర్నెట్‌ అంతా మంచే చేస్తుందనే భావన ప్రమాదకరంగా తయారైందని కొందరంటున్నారు. అంతర్జాతీయ మీడియా సైతం సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరంకుశ ప్రభుత్వాలపై పోరాటానికి దొరికిన వజ్రాయుధమని అరబ్ ఉద్యమాల సమయంలో సోషల్ మీడియాపై ప్రసంశంలు వెల్లువెత్తాయి. కానీ తర్వాత కాలంలో అదే ప్రమాదకరంగా మారిందన్న భావన బలపడుతోంది. మయన్మార్‌లో రోహింగ్యాలపై హింసను ప్రేరేపించడానికి, న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో మసీదులో కాల్పులను ఓ దుండగుడు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఫేస్‌బుక్‌ను వాడటంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి.

యూకేలో సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై నిషేధం విధించేందుకు సిద్దమైంది. ఇటీవల యూకే పార్లమెంట్ రూపొందించిన కొత్త చట్టం ప్రకారం ఈ నిర్ణయం వెలువడనుంది. సామాజిక మాధ్యమాల వల్ల ఉగ్రవాదం, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన పోస్టులు ఎక్కువగా చెలామణి అవుతున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదం, పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తొలగించాలని ఆయా సంస్థలను యూకే సర్కారు ఆదేశించింది. 12 వారాల గడువు ఇచ్చింది. అంతే కాదు ఫేక్ న్యూస్, ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై సైతం యూకే ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com