అమెరికా ఆంక్షలకు తలొగ్గేదిలేదంటున్న టర్కీ
- May 06, 2019
అంకారా: అమెరికా ఆంక్షలకు తలొగ్గమని టర్కీ ఉపాధ్యక్షుడు ఫ్యుట్ ఆక్టే ఉద్ఘాటించారు.శత్రు దేశాల క్షిపణుల దాడులను అడ్డుకునేందుకు మిత్రదేశమైన రష్యా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతున్నామని అన్నారు. రష్యా, టర్కీ మధ్య కుదిరిన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుంటే భారీ ఆంక్షలు మోపుతామంటూ అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని ఆక్టే తెలిపారు. అమెరికా ఆంక్షలకు, బెదిరింపులకు టర్కీ తలొగ్గదని ఆయన స్పష్టం చేశారు. టర్కీ, రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను అమెరికా అడ్డుకోలేదని అన్నారు. రష్యా, టర్కీ మధ్య కుదిరిన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోయినట్టయితే ఎఫ్-35 యుద్ధ విమానాలను టర్కీకి అందజేయలేమని అమెరికా రక్షణ మంత్రి పాట్రిక్ షానహాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..