దుబాయ్ హోటల్లో అగ్ని ప్రమాదం: ముగ్గురికి అస్వస్థత
- May 06, 2019
దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్డులోగల ఓ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుబాయ్ పోలీస్ ఓ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, అక్కడికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ టీమ్ మంటల్ని సకాలంలో అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. హోటల్లోని సౌనా రూమ్‌లో ఈ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. సంఘటన జరిగిన వెంటనే హోటల్ని ఖాళీ చేయించారు. స్వల్ప అగ్ని ప్రమాదం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పొగ పీల్చడం వల్ల ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







