డాక్టర్ పాడు పని.. 65 మంది చిన్నారులతో పాటు 90 మంది పేషంట్లకు..

- May 06, 2019 , by Maagulf
డాక్టర్ పాడు పని.. 65 మంది చిన్నారులతో పాటు 90 మంది పేషంట్లకు..

పేషంట్లు డాక్టర్‌ని తమ ప్రాణాలు కాపాడిన దేవుడిలా చూస్తుంటారు. మరి అలాంటి డాక్టర్‌కి ఏదో భయంకరమైన జబ్బు చేసినట్టుంది. లేకపోతే ప్రాణం పోయాల్సిన డాక్టర్ వారికి ప్రాణాంతక వ్యాధిని వ్యాపింపజేశాడు. పేషంట్ల ఆరోగ్యం మెరుగు పరచాల్సిన డాక్టర్ వారి అనారోగ్యానికి కారణమయ్యాడు. ఓ పాకిస్థానీ డాక్టర్ చేసిన పనికి 65 మంది చిన్నారులతో సహా 90 మందికి హెచ్‌ఐవీ సోకడానికి కారణమయ్యాడు. కలుషిత సిరంజిని వాడడం ద్వారా ఆయన హెచ్‌ఐవీని వ్యాపింపజేశాడు. ఆరోగ్య శాఖ ఫిర్యాదుతో పోలీసులు డాక్టర్‌ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపించారు.

సింధు ప్రావిన్సులోని లర్కానా పట్టణ శివారులోని 18 మంది చిన్నారులను పరీక్షించగా వారందరికీ హెచ్‌ఐవీ సోకినట్లు కనుగొన్నారు. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై మరికొంత మందిని పరీక్షించారు. 65 మంది పిల్లలతో సహా 90మందికిపైగా హెచ్‌ఐవీ బారిన పడినట్లు గుర్తించారు. చిన్నారుల తల్లిదండ్రులను పరీక్షించారు. వారి ద్వారా పిల్లలకు ఏమైనా సోకిందేమో అని అనుమానం వచ్చింది. కానీ వారికి ఈ వ్యాధి ఏమీ లేదని తెలుసుకున్నారు. మరెలా చిన్నారులకు హెచ్‌ఐవీ వచ్చిందని ఆరా తీస్తే ఓ డాక్టర్ చేసిన నిర్వాకం అని తెలిసుకున్నారు. ఆ డాక్టర్‌ కూడా హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుడని తెలుసుకున్నారు. కలుషిత సిరంజిలు వాడి అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలతో ఆడుకున్నాడు. హాస్పిటల్‌కు వచ్చిన చిన్నారులకు అదే సిరంజితో ఇంజక్షన్ తనే ఇచ్చేవాడు. మరి కొంత మంది పెద్దవారికి కూడా ఈ సిరంజినే వాడి హెచ్‌ఐవీ బారిన పడేలా చేశాడు. ఆరోగ్య శాఖ ఎంక్వైరీలో డాక్టర్‌ గురించి తెలుసుకుని ఆయన్ను అరెస్టు చేసినట్లు సింధు ప్రావిన్స్ ఆరోగ్య మంద్రి అజ్ర పెచుహో తెలిపారు. ఇంకెవరైనా ఈ డాక్టర్ కారణంగా హెచ్‌ఐవీ బారిన పడ్డారేమో తెలుసుకునేందుకు మరింత మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజానికి పాక్‌లో హెచ్‌ఐవీ కేసులు చాలా తక్కువగా నమోదవుతాయి. కానీ డ్రగ్స్ వాడేవారు, సెక్స్ వర్కర్లు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి తిరిగివచ్చిన వారి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com