ఇండియా:నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభం
- May 07, 2019
హైదరాబాద్: ఈరోజు నుండి పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. సోమవారం రాత్రి ఏడు గంటలకు ఆకాశంలో నెలవంక కన్పించిందని చార్మినార్ పరిసర మసీదుల నుంచి సైరన్ మోతలు విన్పించాయి. రూహిత్‌హిలాల్ కమిటీ ప్రతినిధులు సైతం నెలవంక దర్శనమిచ్చిందని సమాచారం అందించారు. దీంతో ముస్లింలు చాంద్ ముబారక్ (చంద్రవంక శుభాకాంక్షలు) తెలుపుకొన్నారు. నేటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. మక్కామసీదులో సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు తరావీహ్ నమాజ్ నిర్వహించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల ఏడో తేదీ నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి వెళ్లవచ్చని సూచించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







