కేసీఆర్ ఇవాళ్టి షెడ్యూల్.. ఇదే..

- May 07, 2019 , by Maagulf
కేసీఆర్ ఇవాళ్టి షెడ్యూల్.. ఇదే..

సార్వత్రిక ఎన్నికల సమయం ముగుస్తుండడంతో ఫెడరల్ ఫ్రంట్ కార్యాచరణను ముమ్మరం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికల ముందు 5 రాష్ట్రాల పర్యటన చేసిన కేసీఆర్ మరో మారు రాష్ట్రాల పర్యటన చేపట్టారు. తమతో కలసి వచ్చే పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు . ఫెడరల్ ఫ్రంట్ అవశ్యకతను గురించి వివరించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజార్టీ కేంద్రంలో వచ్చే అవకాశం లేదని, కచ్చితంగా మరొకరి మద్దతు అవసరమని చెప్పారు కేసీఆర్‌. .దేశంలో ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ మాత్రమే అధికారంలో ఉన్నాయని, రెండుపార్టీలు కూడా రాష్ట్రాల అవసరాలను, అభ్యంతరాలను పట్టించుకోలేదని, వీలైనంతవరకు రాష్ట్రాలపై పెత్తనం చూపించేందుకు ప్రాధాన్యమిచ్చాయని అన్నారు. రాష్ట్రాల గొంతుకను సమిష్టిగా వినిపిద్దామని చెప్పారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకొనేందుకు ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఎంతో ఉన్నదని కేరళ సీఎం విజయన్‌కు సీఎం కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదిస్తున్న సమాఖ్య కూటమిలో వామపక్షాలు చేరాలని కోరారు కేసీఆర్.

అటు ఈనెల 13న చెన్నైలో డీ ఎంకే అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌తో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్ . దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళి, ఫలితాల అనంతరం తలెత్తే పరిణామాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంశాలపై చర్చించన్నారు. అలాగే కేరళ పర్యటన సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు .

కేరళ పర్యటనలో భాగంగా అనంత పద్మనాభస్వామిని సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అటు ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమైతే సీఎం ఇవాళ విశ్రాంతి తీసుకొని.. 8న కన్యాకుమారి, 9న రామేశ్వరం, 10న మధురమీనాక్షి ఆలయం, 11న శ్రీరంగం పర్యటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com