ఐడీ కార్డ్‌ దొంగతనం: అప్పీల్‌ని తిరస్కరించిన న్యాయస్థానం

- May 07, 2019 , by Maagulf
ఐడీ కార్డ్‌ దొంగతనం: అప్పీల్‌ని తిరస్కరించిన న్యాయస్థానం

బహ్రెయిన్​:హై అప్పీల్స్‌ కోర్ట్‌, బహ్రెయినీ వ్యక్తి అప్పీల్‌ని తిరస్కరించింది. రాబరీ, ఫ్రాడ్‌ కేస్‌కి సంబంధించి ఓ బహ్రెయినీ వ్యక్తికి హై క్రిమినల్‌ కోర్ట్‌ మూడు సంవత్సరాల జైలు శిక్షను విధించగా, దాన్ని సదరు వ్యక్తి హై అప్పీల్స్‌ కోర్ట్‌లో సవాల్‌ చేయగా, అక్కడ అతనికి తిరస్కారం ఎదురయ్యింది. జుఫ్ఫైర్‌లో పార్క్‌ చేసిన ఓ కారు నుంచి ఐడీ కార్డ్‌ని దొంగిలించిన నిందితుడు, దాని ద్వారా వాహనాన్ని లీజ్‌కి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కాగా, అంతకు ముందు అనుమానితుడు రెంట్‌ ఎ కార్‌ కంపెనీ నుంచి కారుని అద్దెకి తీసుకుని, తిరిగి సదరు సంస్థకు ఇవ్వకుండా తప్పించుకు తిరగడంతో అసలు వ్యవహారమంతా వెలుగు చూసింది. ఐడీ కార్డ్‌ దొంగిలించబడిందని గుర్తించిన పోలీసులు, దాని ద్వారా నిందితుడ్ని పట్టుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com