రమదాన్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాకి ఎల్‌ఈడీ సొగసులు
- May 07, 2019
దుబాయ్:పవిత్ర రమదాన్ మాసంలో దుబాయ్‌లోని ముఖ్యమైన నిర్మాణాల్లో ఒకటైన బుర్జ్ ఖలీఫా ఎల్‌ఈడీ వెలుగులతో మెరిసిపోనుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఎల్‌ఈడీ షోలను ఏర్పాటు చేశారు. మొదటి షో మూడు నిమిషాలపాటు వుంటుంది. రమదాన్ ప్రాముఖ్యతను చెప్పే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. క్రిసెంట్ మూన్ సహా అరబిక్ లాంతర్స్ ఈ షోలో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తాయి. జియోమెట్రిక్ ప్యాటర్న్స్‌తో అత్యంత అద్భుతంగా దీన్ని రూపొందించారు. ఓరియెంటెల్ మ్యూజిక్‌తో ఈ షో వుంటుంది. రెండో షో, పెయింటర్ ఆర్ట్ నూర్ ద్వారా డిస్‌ప్లే చేయబడుతోంది. అల్లాకి చెందిన 99 పేర్ల నుంచి ఇన్‌స్పయిర్ అయి దీన్ని రూపొందించారు. కాగా, రమదాన్ సందర్భంగా బుర్జ్ ఖలీఫాలోని హయ్యస్ట్ అబ్జర్వేషన్ డెక్ సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు పొడిగించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







