ప్రముఖ జ్యూవెలరీ సంస్థ ఘరానా మోసం
- May 07, 2019
హైదరాబాద్‌లో మరో జ్యూవెలరీ షాపు బండారం బయటపడింది. బంగారు ఆభరణాల అమ్మకాలు, ఎగుమతుల్లో శ్రీ కృష్ణా జ్యూవెలర్స్ మోసాలకు పాల్పడుతుందంటూ ఆ సంస్థ ఎండీతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. విదేశాలకు ఎగుమతి చేసినట్లు దొంగ లెక్కలు చూపించి లోకల్ మార్కెట్లోకి దాదాపు 11 వందల కేజీల బంగారాన్ని తరలించినట్లు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ గుర్తించింది. అలాగే..అభరణాల పేరుతో రత్నాలు, విలువైన రాళ్లను విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు డీఆర్ఐ నిర్ధారించుకుంది. బంగారం తూకాన్ని ఎక్కువగా చూపిస్తూ..రత్నాలను తక్కువ లెక్కచెబుతూ వచ్చిన శ్రీకృష్ణ జ్యూవెలర్స్..వాస్తవంలో మాత్రం రత్నాలు, విలువైన రాళ్లను ఎక్కువగా ఎక్స్ పోర్ట్ చేసినట్లు డీఆర్ఐ లెక్క తేల్చింది.
శ్రీకృష్ణ జ్యూవెలర్స్ విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకొని నగల తయారీకి లైసెన్స్ ఉంది. అలాగే ఎగుమతులకు కూడా అనుమతి ఉంది. అయితే..బంగారం ఎగుమతుల పేరుతో వందల కోట్లలో అక్రమాలకు పాల్పడటంపై డీఆర్ఐ ఫోకస్ చేసింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ షోరూంతో పాటు శంషాబాద్ దగ్గర్లోని రావిరాల సెజ్‌లోని సంస్థ యూనిట్ లో మూడు రోజుల పాటు తనిఖీలు చేపట్టారు అధికారులు. సెజ్ యూనిట్లో 10 కేజీల ఫారెన్ మార్క్ బంగారాన్ని సీజ్ చేశారు. అలాగే బంజారహిల్స్ లోని సంస్థ షోరూంలో 21 కేజీల ఫారెన్ మార్క్ గోల్డ్ ను సీజ్ చేశారు. మొత్తం 14 కోట్ల విలువైన అభరణాలను డీఆర్ఐ జప్తు చేసింది.
ఎగుమతి చేసినట్లు మాయచేసి ఆ బంగారాన్ని దేశీయ మార్కెట్లోకి మళ్లించటంతో పాటు..ఎగుమతి చేసిన అడపాదడపా బంగారం విషయంలో శ్రీకృష్ణ జ్యూవెలర్స్ తప్పుల మీద తప్పులు చేసింది. పన్నులు ఎగ్గొట్టేందుకు మోసాలకు పాల్పడింది. ఎగుమతి అభరణాల్లో విలువైన రత్నాలను పొదిగి..దాన్ని బంగారంగానే లెక్క చూపిస్తు వచ్చింది. అలా లెక్కల్లో జ్యూవెలరీ విలువ తగ్గించి వందల కోట్ల పన్ను ఎగ్గొట్టింది శ్రీకృష్ణ జ్యూవెలరీ.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







