దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం
- January 01, 2016
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డిఎస్ఎఫ్) 21వ ఎడిషన్ జనవరి 1న ప్రారంభమయ్యింది. ప్రతి సంవత్సరంలానే దుబాయ్ ఫెస్టివల్ ఈసారి కూడా బోల్డన్ని ఆఫర్లతో కొనుగోలుదారులకు సంబరాలను తీసుకొచ్చింది. ఆర్గనైజర్స్ దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ (డిఎఫ్‌ఆర్‌ఇ), డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కమర్షియల్ మార్కెటింగ్ (డిటిసిఎం) గత సంవత్సరం డిఎస్ఎఫ్ బంపర్ డ్రా విజేతలు తాము గెలుచుకున్న బహుమతులు, వారి ఆనందాన్ని తెలుసుకుంది. ఫిలిప్పీన్స్‌కి చెందిన రోజ్ వినో, 350,000 దిర్హామ్‌లను గెలుచుకున్నారు. దాంతో వారు కొత్తగా కారు కొనుక్కోవడమే కాకుండా, ఆర్థికంగా ఎంతో వృద్ధిలోకి వచ్చారు. మామూలుగా షాపింగ్ చేసి వచ్చేసిన తమకు, బహుమతి గెల్చుకున్నామని నిర్వాహకులు తెలపగానే ఆనందంతో షాక్‌కి గురయ్యామని రోజ్ వినో చెప్పారు. భారతదేశానికి చెందిన అనిల్‌కుమార్, పదిహేనేళ్ళుగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ చూస్తున్నాననీ, ఎప్కో పెట్రోల్ స్టేషన్లో తాను కొన్న టిక్కెట్, తన దశ మార్చేసిందని, ఇండియాకి వెళ్ళి కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసి వచ్చాననీ, మిగిలిన సొమ్ముతో తన కుమారుడికి మంచి విద్యను అందించగలుగుతున్నాని చెప్పారు. ఈసారి కూడా కళ్ళు చెదిరే బహుమతులతో, అలాగే సర్వ హంగులతో దుబాయ్ పెస్టివల్ వినియోగదారులను అలరించడానికి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, ఛలో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









