రాస్‌గ్యాస్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జి సరఫరా ఒప్పందం

- January 01, 2016 , by Maagulf
రాస్‌గ్యాస్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జి సరఫరా ఒప్పందం

రాస్‌గ్యాస్‌ మరియు పెట్రోనెట్‌, సేల్‌ అండ్‌ పర్చేజ్‌ ఎగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాయి. అదనంగా 1 మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జి సరఫరా ఒప్పందంలో భాగంగా ఈ ఎగ్రిమెంట్‌ జరిగింది. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా కేటాయించబడిన ఎల్‌ఎన్‌జి భారత సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, గెయిల్‌ (ఇండియా) మరియు గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ కోసం ఉపయోగించబడ్తాయి. ఈ ఒప్పందం తమ సంస్థల మధ్య బంధం మరింత ధృఢంగా మార్చుతుందని పెట్రోనెట్‌, రాస్‌గ్యాస్‌ సంస్థలు చెప్పాయి. రాస్‌ గ్యాస్‌, భారత్‌కి అతి పెద్ద ఎల్‌ఎన్‌జి సరఫరాదారు. అలాగే, పెట్రోనెట్‌ ఇండియాకి చెందిన అతి పెద్ద ఎల్‌ఎన్‌జి దిగుమతిదారు. దేశంలోని అతి పెద్ద రిసీవింగ్‌ టెర్మినల్‌ని గుజరాత్‌ కోచిలలో కలిగి వుంది పెట్రోనెట్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com