'రాబర్ట్‌'లో ప్రతినాయకుడుగా జగ్గుభాయ్

'రాబర్ట్‌'లో ప్రతినాయకుడుగా జగ్గుభాయ్

బెంగళూరు: ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు తమ అభినయ విశ్వరూపాన్ని మరోసారి కన్నడిగులకు చూపనున్నారు. నిఖిల్‌కుమారస్వామి కథానాయకుడిగా 'జాగ్వార్‌' సినిమాలో నటించిన జగపతి బాబు తొలిసారిగా ఛాలెంజింగ్‌స్టార్‌ దర్శన్‌ నటిస్తున్న 'రాబర్ట్‌' సినిమాలో ప్రతినాయకుడుగా నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం సన్నివేశాన్ని బెంగళూరులోని బనశంకరిలో చిత్రీకరించారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుంది. రాబర్ట్‌ సినిమాలో ఐశ్వర్యా రాయ్‌ నటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఇది గాలివార్త అని తరువాత తెలిసింది. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి. తరుణ్‌సుధీర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

Back to Top