ఇమ్రాన్ హష్మీతో వినూత్న కథా చిత్రం చేస్తున్న బిగ్ బి

ఇమ్రాన్ హష్మీతో వినూత్న కథా చిత్రం చేస్తున్న బిగ్ బి

70ఏళ్ళ వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న అమితాబ్ బచ్చన్ చివరిగా బద్లా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో ఆడియన్స్‌ని ఎంతగానో అలరించారు. తాజాగా మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బిగ్ బీ. బాలీవుడ్ కిస్సింగ్ వీరుడు ఇమ్మాన్ హష్మీతో కలిసి మిస్టరీ థ్రిల్లర్ చెహర్ అనే సినిమా చేయబోతున్నారు. ఈ రోజు నుండి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. కృతి కర్బంధ, రియా చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, రఘుబీర్ యాదవ్, దృత్‌మాన్ చక్రవర్తి, అన్ను కపూర్ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రుమి జఫ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆనంద్ పండింట్ మోషన్ పిక్చర్స్‌, సరస్వతి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 21, 2020న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Back to Top