ఖతార్‌కు బి-52 బాంబర్లను తరలించిన అమెరికా
- May 11, 2019
వాషింగ్టన్:ఇరాన్‌తో యుద్ధ మేఘాలు అలుముకుంటున్న నేపథ్యంలో అమెరికా వాయుసేన ఖతార్‌లోని తమ వైమానిక స్థావరానికి బి-52 తరహా బాంబర్ యుద్ధ విమానాలను తరలించింది. ఇరాన్ నుండి ఎటువంటి అనూహ్యమైన ముప్పు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ విమానాలను తరలిస్తున్నట్లు వాయుసేన ఒక ప్రకటనలో వివరించింది. ఈ మేరకు తమ వద్దకు బి-52 బాంబర్ యుద్ధ విమానాలు గురువారం రాత్రి చేరుకున్నట్లు కతార్‌లోని అమెరికా వాయుసేన అధికారులు చెప్పారు. ఈ విమానాలు లూసియానాలోని 20వ బాంబ్ స్క్వాడ్రన్ నుండి వచ్చాయని, ఇతర బి-52లు ఆగేయాసియాలోని ఒక ప్రాంతానికి చేరుకున్నాయని వాయుసేన తన ప్రకటనలో వివరించింది. అంతకు ముందు లూసియానా నుండి టేకాఫ్ తీసుకుంటున్న బి-52 బాంబర్లతో కూడిన వీడియోను అమెరికన్ వాయుసేన విడుదల చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







