'సెవెన్' ట్రైలర్ విడుదల..
- May 10, 2019
అనగనగా ఓ అబ్బాయి. పేరు కార్తీక్. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడని అతడిపై కేసు నమోదు అవుతుంది. దాంతో పోలీసులు కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపడతారు. 'కార్తీక్ మిస్సింగ్' అని ఫొటోలు విడుదల చేస్తారు. అయితే... అతడు కార్తీక్ కాదని, కృష్ణమూర్తి అని ఓ వ్యక్తి చెబుతాడు. అమ్మాయిలను మోసం చేసింది ఎవరు? కార్తీకా లేక... కృష్ణమూర్తా? మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టు... కార్తీక్ లాంటివాడు ఇంకొకడు ఉన్నాడా? ఇంకొకరు ఎవరైనా కృష్ణమూర్తిలా మారి అమ్మాయిలను మోసం చేశాడా? ఈ సస్పెన్స్‌కి జూన్ 5న తెరదించుతామని రమేష్ వర్మ చెబుతున్నారు.
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన 'సంపోద్దోయ్ నన్నే', పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన 'ఇదివరకెపుడు తెలియదు' పాటలు విడుదలయ్యాయి. గురువారం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. జూన్ 5న సినిమా విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ.. ''ట్రైలర్, ఇప్పటివరకూ విడుదలైన పాటలకు అద్భుత స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల్లో సినిమాకు వస్తున్న స్పందన చూసి బిజినెస్ బాగా జరిగింది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు హక్కులను తీసుకుంది. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది'' అన్నారు.
హీరో హవీష్ మాట్లాడుతూ.. ''మంచి కథతో రూపొందిన చిత్రమిది. న్యూ ఏజ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఇంతమంది హీరోయిన్లతో ఇటువంటి కథతో సినిమా చేయడం కష్టం. రమేష్ వర్మగారి వల్లే ఈ సినిమా సాధ్యమైంది. ట్రైలర్, పాటలకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ ఎంత కొత్తగా ఉందో... సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది'' అన్నారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







