రాజ్‌కందుకూరి తనయుడు హీరోగా సినిమా షూటింగ్ ప్రారంభం
- May 11, 2019
ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల తనయులు వారసులుగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లోకి మరో వారసుడు హీరోగా వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి పెళ్ళి చూపులు చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు.
చాలా మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా రాజ్‌కందుకూరికి మంచి పేరుంది. ఆయన తన తనయుడు శివ కందుకూరిని హీరోగా తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు. భరత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, గతంలో కాజల్ కి మేనేజర్ గా పనిచేసిన 'రాన్సన్' నిర్మిస్తున్నారు. మేఘా ఆకాశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను లాంచ్ చేశారు.
ఈ చిత్రానికి కాజల్ క్లాప్ ఇవ్వగా .. సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి 'మనుచరిత్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. కాజల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి