రోజూ ఒక స్పూన్ తేనె చాలు..
- May 12, 2019జంక్ ఫుడ్స్, బయట ఆహారాలు, నిల్వ ఉంచిన ఆహారాలు తినడం వలన చాలా మంది ఫుడ్ పాయింజనింగ్ బారిన పడుతున్నారు. ఇలా జరిగినప్పుడు వాంతులు విరేచనాలు అవుతాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే వీటి నుండి ఉపశమనం పొందవచ్చు.
కడుపులో వికారంగా ఉన్నప్పుడు జీలకర్రను నమిలి మింగితే ఫలితం కనిపిస్తుంది. లేదా జీలకర్రను నీటిలో మరిగించి కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటిని తాగితే కడుపులో మంట వికారం తగ్గుతుంది. రోజూ ఒక స్పూన్ తేనెను తీసుకున్నా ఫుడ్ పాయిజనింగ్ నుండి తప్పించుకోవచ్చు.
ఫుడ్ పాయిజనింగ్ వలన శరీరంలో పొటాషియం పరిమాణాలు తగ్గిపోతాయి. అప్పుడు చాలా నీరసం వస్తుంది. ఆ సమయంలో అరటిపండు తినాలి. లేదా రెండు అరటిపండ్లను గుజ్జుగా చేసి పాలలో కలిపి తాగితే ప్రయోజనం కనిపిస్తుంది. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఒక కప్పు పెరుగు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం