ఉగ్రవాదంపై చర్యలు..
- May 12, 2019
ఉగ్రవాదంపై భారత్ సహా వివిధ దేశాలు ముప్పేట దాడి చేస్తుడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. తప్పనిసరిగా ఉగ్రవాదంపై చర్యలు చేపడ్తోంది. మొన్న మసూద్ అజర్ ఆస్తులను స్తంభింప చేసిన ఇమ్రాన్ సర్కారు.. తాజాగా జైషే మహ్మద్ సంస్థ సహా మొత్తం 12 అతివాద సంస్థలను నిషేధించింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారి భారత్‌కు పక్కలో బల్లెంగా తయారైన దయాది పాకిస్థాన్.. ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గింది. ఉగ్రవాదంపై పొరుగుదేశాలను సంతృప్తి పరిచే చర్యలకు శ్రీకారం చుట్టింది. గతకొంతకాలంగా భారత్ కు తలనొప్పిగా మారిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై తాజాగా నిషేధం విధించింది. జైషే సంస్థ సహా మొత్తం 12 అతివాద సంస్థలపై నిషేధిత జాబితాలో చేర్చారు. నేషనల్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఇమ్రాన్ సర్కారు తెలిపింది.
ఉగ్రవాద సంస్థల అధినేతలు హఫీజ్ సయిద్, మసూద్ అజార్‌తో పాటు ఉగ్రవాద గ్రూప్‌లతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చినట్లు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. లాహోర్ లోని అల్ అన్ఫల్ ట్రస్ట్, ఇదరే ఖద్మత్ ఖలాక్, అల్ దావత్ ఉల్ ఇర్షాద్, మాస్క్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్, మువాజ్ బిన్ జబల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, అల్ మదీనా ఫౌండేషన్, అల్ ఈసర్ ఫౌండేషన్ లతో పాటు ఫైసలాబాద్‌లోని అల్ హమద్ ట్రస్ట్, భావల్పూర్ లోని అల్ రహమత్ ఆర్గనైజేషన్, కరాచీలోని అల్ ఫర్ఖాన్ ట్రస్ట్ లు నిషేధించిన జాబితాలో ఉన్నాయి.
మరోవైపు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ తన పేరు మార్చుకుంది. ఇప్పుడా సంస్థ పేరు జైషే ముత్తాఖీ! అయితే పాకిస్థాన్ నిషేధించిన ఉగ్రవాద సంస్థల్లో జైషే మహ్మద్ ఉంది కానీ, జైషే ముత్తాఖీ లేకపోవడం ఉగ్రవాదంపై ఇమ్రాన్ ఖాన్ సర్కారు డొల్లతనాన్ని తెలుపుతోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







