మరో అడుగు ముందుకు వేద్దాం... !!
- January 02, 2016
నేస్తం...
ఆ మధ్యెప్పుడో నాకు ప్రతిఘటనలోని పాట గుర్తు వచ్చింది.. ఈ దుర్యోదన దుశ్శాసన ....కలియుగానికి ఆరవ వేదం కూడా చాలదేమో అనిపిస్తోంది.. ఈ వాట్స్ప్ లు ముఖ పుస్తకాలు వచ్చాక మనతో మనం గడిపే సమయం కూడా తగ్గిపోయినట్లుగా ఉంది.. సమయం, సందర్భం లేకుండా ఫ్రెండ్ అని ఆడ్ చేస్తే చాలు టాగ్ లు , గుడ్ మాణింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ... మధ్యలో ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా... పని ఏమి ఉండదో మరి ఏమో ...వయసుతో అస్సలు పనే ఉండదు .. ఇదో గోల అనుకుంటే ఈ యాప్ లతో ఒక గోల ... సరదాగా తీసుకోండి సరదా యాప్లని ... మనం అనే ఒక చిన్న మాట ఎదుటి వారిని ఎంతగా బాధ పెడుతుందో మాట అనే ముందు ఆలోచించండి.. ఈ ప్రపంచంలో అందరు ఏదో ఒక ఇబ్బందిలో ఉన్నవారే.. మనకు మనదే పెద్ద కష్టం కావచ్చు .. ఎప్పుడయినా మనకు మన బాధ్యతలు, ఈ జీవితంలో మనతో ముడి వేసుకున్న బంధాలు ముఖ్యం... వాటి తరువాతే ఏ ఇతర అనుబంధాలు అయినా.. సాధ్యమైనంత వరకు అందరిలో మంచినే చూద్దాం... ఈ సంవత్సరం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను వదలి వేయడానికి ప్రయత్నిస్తూ మరో అడుగు ముందుకు వేద్దాం...!!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







