రేపే విజయ్ కొత్త సినిమా ప్రారంభం..
- May 18, 2019
అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ..ఓ సినిమా రిలీజ్ కు సిద్ధం అవ్వగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ చిత్రం సెట్స్ ఫై ఉండగానే క్రాంతి మాధవ్ సినిమాలో జాయిన్ అయినా విజయ్..ఇప్పుడు డియర్ కామ్రేడ్ రిలీజ్ కు సిద్ధం కాగానే మరో సినిమాను లైన్లో పెట్టాడు. తమిళ్ డైరెక్టర్ ఆనంద్ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. ఇప్పుడు ఆ సినిమాకు ముహూర్తం కుదిరింది.
రేపు ఈ సినిమాకు సంబందించిన పూజా కార్య క్రమాలు జరపనున్నారు. ఈ సినిమాలో విజయ్ బైక్ రైసర్ గా కనిపించబోతున్నాడు. రేపు శ్రీకారం చుట్టి, ఈనెల 22 నుంచి రెండు బైక్ రేసింగ్ సీన్లు చిత్రీకరణను ఢిల్లీలో ప్రారంభించబోతున్నారు. ఈ రెండు సీన్లకే దాదాపు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట మైత్రి మూవీస్ వారు. ఇందుకోసం విదేశాల నుంచి బైక్ రేసర్లను, డ్రోన్ లను, ఆపరేటర్లను, స్కార్పియో ఎక్విప్ మెంట్ ను తెప్పిస్తున్నారు. కేవలం రైస్ ట్రాక్ మీద షూటింగ్ పర్మిషన్ కే కోటికి పైగా చెల్లించినట్లు తెలుస్తోంది.
మరి ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి.
ఇక భరత్ కమ్మ డైరెక్షన్లో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం జులై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







