'ఐ హేట్ యూ అమ్మ'... లఘుచిత్రం
- May 18, 2019
'ఐ హేట్ యూ అమ్మ'... లఘుచిత్రం. తరాల అంతరాల్లో తల్లి మాట, పాత్ర ఓవర్ ప్రొటెక్టివ్‌గా కనిపిస్తోంది. ఎంత వయసుకొచ్చినా ఇంకా తెలుసుకోవాల్సింది ఉందనే విషయాన్ని పదేపదే మాట్లాడే యుక్తవయస్సు పిల్లలే, అమ్మ భయాల దగ్గరకొచ్చేసరికి విపరీత అసహనానికి లోనవుతారు. చాదస్తంగా కొట్టిపడేస్తారు. తల్లి తమను ఇంకా చిన్నపిల్లల్లా చూస్తోందని ఫ్రస్టేట్ అయ్యేవారే, తల్లి జాగ్రత్తల్ని అర్థంచేసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. ఈ జెనరేషన్ గ్యాప్ సమస్య చుట్టూతానే ఈ కథ నడుస్తుంది. ఆరు నిమిషాల చిన్ని చిత్రమే అయినా, చాలా పెద్ద విషయాన్ని చర్చిస్తుంది. 'ఏదైనా గాయపరిచే వస్తువుకి దూరంగా జరగడం...' అనే ఓ చిన్న మాటతో తల్లి జాగ్రత్త మనస్తత్వాన్ని యంగ్ మైండ్స్‌కి అర్థం చేయించే ప్రయత్నం చేసిన దర్శకడు సతీష్ రెడ్డి మల్లిడి, రచయిత భార్గవ్ రైట్స్‌ను అభినందించాలి. సోనియా సింగ్ నటనతో ఆకట్టుకుంటుంది. శరత్ అంకిత్ నడిమింటి, చిన్నవాసుదేవ రెడ్డి ఈ చిత్ర నిర్మాతలు. యూట్యూబ్ చానెల్ 'హే పిల్లా..!'లో ఈ చిత్రాన్ని వీక్షించొచ్చు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







