గ్రీన్ కార్డులను బిల్డ్ అమెరికా వీసా పేరుతో మార్పు
- May 19, 2019
నూతన వలస విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విధానంలో ప్రస్తుతం ఇస్తున్న గ్రీన్ కార్డులను బిల్డ్ అమెరికా వీసా పేరుతో మార్పు చేశారు. ఇప్పటిదాకా కుటుంబ సంబంధాల ఆధారంగా 66 శాతం, నైపుణ్యాల ఆధారంగా 12 శాతం గ్రీన్ కార్డులు జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో మాత్రం ప్రతిభకే పట్టం కట్టారు. నైపుణ్యాల ఆధారంగా ఇస్తున్న కోటాను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచారు. దీనివల్ల దశాబ్దాలుగా గ్రీన్‌కార్డులు దొరక్క, దినదినగండంగా కాలం నెట్టుకొస్తున్న వేలాది మంది భారతీయులు లాభపడనున్నారు. ప్రస్తుతం ఉన్న విధానాల ద్వారా నైపుణ్యవంతులకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాం. నూతన విధానం ఆమోదం పొందితే అలా జరిగే అవకాశం ఉండదు అని ట్రంప్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







