కేదార్‌నాథ్‌ లో మోదీ

- May 19, 2019 , by Maagulf
కేదార్‌నాథ్‌ లో మోదీ

ప్రధాని మోదీ ఆధ్యాత్మిక బాట పట్టారు. ఇన్నాళ్లు ఎన్నికల కురుక్షేత్రంలో బిజీబిజీగా ఉన్న ఆయన.. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ను సందర్శిం చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నేరుగా కేదార్‌నాధ్ చేరుకున్న మోదీకి ఆలయ పూజారులు సంప్రదాయపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయం దగ్గరకు వెళ్లిన మోదీ, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత గర్భగుడిలోకి వెళ్లి కేదారనాధునికి ప్రత్యేక పూజలు చేశారు.

గర్భగుడిలో దాదాపు అరగంట పాటు మోదీ పూజలు చేశారు. బోలేనాథునికి మోదీ రుద్రాభిషేకం, అర్చన నిర్వహించారు. పూజాదికాల అనంతరం ఆలయం బయటకు వచ్చిన మోదీ, అక్కడ ఉన్న నందీశ్వరునికి కూడా పూజ‌లు చేశారు. ఆల‌య అర్చకలు మోదీకి ఓ క‌ట్టె, శాలువాను బ‌హుక‌రించారు.

బోలేనాథుని దర్శనంలో మోదీ వస్త్రధారణ స్థానికులను థ్రిల్‌కు గురి చేసింది. నేపాలీ లుక్‌లో నీలిరంగు చోలా డ్రెస్సులో మోదీ కేదారనాథున్ని దర్శించు కున్నారు. హిమాచల్‌ప్రదేశ్ ప్రజలు ధరించే టోపీ పెట్టుకున్నారు. నడుముకు ఎర్రటి కండువా కట్టుకున్నారు. మెడలో భారీ శాలువా వేసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ వస్త్రధారణలోనే మహాశివునికి పూజాదికాలు నిర్వహించారు.

ఆలయ సందర్శన, ప్రత్యేక పూజల తర్వాత మోదీ ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్ర గుహకు వెళ్లారు. అక్కడ కాసేపు ధ్యానం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేప‌ట్టిన త‌ర్వాత మోదీ కేదార్‌నాథ్ వెళ్లడం ఇది నాలుగోసారి. మోదీ నిన్న రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ బద్రీనాధ్‌కు వెళ్లిప్రత్యేక పూజలు చేసి, స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com