తొలి క్వార్టర్‌లో 1500 తవాసుల్‌ ఫిర్యాదులు

- May 20, 2019 , by Maagulf
తొలి క్వార్టర్‌లో 1500 తవాసుల్‌ ఫిర్యాదులు
మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌ మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ మరియు అర్బన్‌ ప్లానింగ్‌, తవాసుల్‌ ద్వారా తొలి క్వార్టర్‌లో 1500 ఫిర్యాదుల్ని ప్రోసెస్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పౌరులు అలాగే రెసిడెంట్స్‌ ఈ-ఫెసిలిటీ తవాసుల్‌ని బాగా వినియోగించుకుంటున్నట్లు మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ నబి అబు అల్‌ ఫాత్‌ మాట్లాడుతూ, మొత్తంగా 1514 ఫిర్యాదులు అందాయనీ, పౌరులు అలాగే నివాసితులు ఈ సర్వీసుని వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఏ రోజైనా, ఏ సమయలో అయినా సలహాలు ఇవ్వడానికీ, సమస్యల గురించి చెప్పడానికీ ఈ తవాసుల్‌ని వినియోగిస్తున్నారు. తవాసుల్‌ని ప్రతి గవర్నమెంట్‌ ఎన్‌టైటీ, డెడికేటెడ్‌ టీమ్‌తో సలహాల్ని స్వీకరించేందుకు, ఫిర్యాదులు తీసుకునేందుకు సిద్ధంగా వుంటోంది. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com