యూఏఈలో భారీ వర్షాలు: గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు?
- May 20, 2019
ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో యూఏఈ వాసులు ఆనందంతో తడిసి ముద్దయ్యారు. ఈ భారీ వర్షం కారణంగా, యూఏఈలో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల వరకు తగ్గే అవకాశాలున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. దేశంలోని వెస్ట్రన్ పార్ట్‌లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. 6 డిగ్రీల వరకు ఇక్కడ తగ్గుదల నమోదయ్యింది. ఇతర ప్రాంతాల్లోనూ గణనీయంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే తగ్గినట్లు అధికారులు వివరించారు. ఈ ఏడాది సాధారణ వర్షాలు కురిసే అవకాశం వుందనీ వింటర్ నుంచి సమ్మర్‌కి మారే ఈ సమయంలో ఇలాంటి వర్షాలు కురిసే అవకాశాలుంటాయని ఎన్‌సిఎం అధికారులు విశ్లేషించారు. ఎండల తీవ్రత తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టాక తిరిగి ఎండల తీవ్రత కొనసాగుతుందని అంటున్నారు అధికారులు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







