బంతి ఇరాన్‌ కోర్టులో వుంది: సౌదీ అరేబియా

- May 20, 2019 , by Maagulf
బంతి ఇరాన్‌ కోర్టులో వుంది: సౌదీ అరేబియా

రియాద్‌: మధ్యప్రాచ్యంలో యుద్ధ నివారణకే తాము ప్రయత్నిస్తున్నామని, అవసరమైతే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా వున్నామని సౌదీ అరేబియా పేర్కొంది. సౌదీ విదేశాంగశాఖసహాయ మంత్రి ఆదెల్‌ అల్‌ జుబేర్‌ ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, బంతి ఇప్పుడు ఇరాన్‌ కోర్టులోనే వుందని వ్యాఖ్యానించారు. రెండురోజుల క్రితం తమ తీరప్రాంతం లోని రెండు చమురు పంపింగ్‌ స్టేషన్‌లపై జరిగిన ద్రోన్‌ దాడులు ఇరాన్‌ పనేనని ఆయన ఆరోపించారు. అంతకు రెండు రోజుల ముందు ఎమిరేట్స్‌ తీర ప్రాంతంలో రెండు సౌదీ చమురు నౌకలను ధ్వంసం చేసింది కూడా ఇరానే అని సౌదీ రెబల్‌ గ్రూప్‌ హౌతీలు ఈ మేరకు చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో ఏ ఒక్క దానిలోనూ తమ ప్రమేయం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. సౌదీ అరేబియా ఈ ప్రాంతంలో యుద్ధాన్ని కోరుకోవటం లేదని ఆయన అన్నారు. యుద్ధాన్ని నివారించేందుకు తాము చేయగలిగిందంతా చేస్తామని, ఎదుటి వారు యుద్ధాన్ని కోరుకుంటే తాము కూడా అందుకు దీటుగా స్పందిస్తామని ఆయన స్పష్టంచేశారు. సౌదీ చమురు నౌకలు, చమురు పంపింగ్‌ కేంద్రాలపై దాడుల ప్రకంపనలపై చర్చించేందు కు ఈ నెల 30న మక్కాలో జరిగే అత్యవసర సమావేశానికి హాజరు కావాలని సౌదీ రాజు సల్మాన్‌ గల్ఫ్‌, అరబ్‌ దేశాల నేతలు ఆహ్వానించారు. అయితే సౌదీ మిత్రదేశమైన అరబ్‌ ఎమిరేట్స్‌ తమ తీరంలోని చమురు కేంద్రాలు, చమురు నౌకలపై జరిగిన దాడులకు ఎవరినీ నిందించకపోవటం గమనార్హం. ఈ దాడులకు ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత ను కూడా ప్రకటించలేదన్న విషయం తెలిసిందే. అయితే ఇరానే ఈ దాడులను ప్రోత్సహించినట్లు తాము భావిస్తు న్నట్లు చెప్పిన అమెరికా అధికారులు మధ్యప్రాచ్యంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించటం విశేషం.

పాంపియోతో సౌదీ యువరాజు ఫోన్‌ భేటీ 
గల్ఫ్‌లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై సౌదీ యువరాజు మహ్మద్‌ బీన్‌ సల్మాన్‌ అమెరికా విదేశాం గ మంత్రి మైక్‌ పాంపియోతో ఫోన్‌లో చర్చలు జరిపినట్లు సౌదీ సమాచార మంత్రిత్వశాఖ ఒకట్వీట్‌లో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com