రాళ్ళపల్లికి కన్నీటి వీడ్కోలు

రాళ్ళపల్లికి కన్నీటి వీడ్కోలు

 సినీ హాస్యనటుడు రాళ్ళపల్లి వెంకట నరసింహారావుకు ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు రాయదుర్గం మహాప్రస్థానంలో సోమవారం ఉదయం నిర్వహించారు. మొదట తన నివాసం నుంచి ప్రారంభమైన ఆయన అంతిమ యాత్ర రాయదుర్గం మహాప్రస్థానానికి చేరుకుంది. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని స్మశాన వాటికకు తీసుకొని వచ్చి విద్యుత్‌ దహన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టారు. అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు రాజశేఖర్, జీవిత దంపతులు, కోట శ్రీనివాసరావు, భరద్వాజ, తనికెళ్ళభరణి, బాబూమోహన్, శివాజీరాజాతో పాటు ఆయన అభిమానులు పాల్గొన్నారు.

Back to Top