ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతు

ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతు

ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న ఆకస్మిక వరదల్లో ఓ కుటుంబం గల్లంతయ్యింది. వారు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారంతా భారతదేశానికి చెందినవారని అధికారులు అంటున్నారు. వాడి బని ఖాలిద్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 28 రోజుల పసికందు కూడా గల్లంతవడం గమనార్హం. రెస్క్యూ టీమ్స్‌, వారు ప్రయాణిస్తున్న వాహనానికి సంబంధించిన శకలాల్ని కనుగొన్నప్పటికీ, బాధిత కుటుంబం ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోయారు. సర్దార్‌ ఫజల్‌ అహ్మద్‌ అనే వ్యక్తికి చెందిన కుటుంబం ఈ వరదల్లో గల్లంతయ్యింది. వరదల సమయంలో తాను ఎలాగో ఓ చెట్టుని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నట్లు తెలిపారాయన. 

Back to Top