యాత్రీకుల భద్రత కోసం నడుం బిగించిన సౌదీ సివిల్ డిఫెన్స్
- May 20, 2019
మక్కా: మక్కా సివిల్ డిఫెన్స్, సిటీలో యాత్రీకుల భద్రత నిమిత్తం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఇన్‌స్పెక్షన్ ప్రోగ్రామ్స్‌తో ముందుకొస్తోంది. పవిత్ర రమదాన్ మాసంలో యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా వుండేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు మక్కా సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ - సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఫవ్వాజ్ బిన్ ఇబ్రహీమహ& అల్ జాయిది చెప్పారు. మొత్తం 5,775 లైసెన్సుల్ని ఈ ఏడాది ఇప్పటిదాకా మంజూరు చేయడం జరిగిందనీ, ఇందులో 635 హోటల్ అలాగే ఫర్నిష్డ్ అపార్ట్‌మెంట్స్, 228 రెస్టారెంట్ లైసెన్సులు వున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 2,140 ఇన్‌స్పెక్షన్స్ జరిగాయని అధికారులు వివరించారు. ఎప్పటికఫ్పుడు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా యాత్రీకుల భద్రతపై అప్రమత్తం చేస్తున్నట్ల తెలిపారు అధికారులు. ఫైర్ సేఫ్టీ మరియు ఎవాక్యుయేషన్‌కి సంబంధించిన వివరాల్ని కూడా టీవీలలో తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







